శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 15:45:06

మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన ట్రంప్‌

 మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భార‌త్ పై వాణిజ్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకున్నాడు. అంతే కాకుండా మోదీ  చాలా మంచోడంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు.  మోదీ చాలా మంచివాడంటూ ప‌దేప‌దే చెప్పుకొచ్చారు. ఫాక్స్ న్యూస్ తో ఇవాళ ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను 29మిలియన్లకు పైగా  డోస్ లను కొనుగోలు చేశాన‌న్నా ట్రంప్‌.. భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు.హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ అమెరికాకు వస్తుంది.  నేను మోడీని అడిగాను? మోడీ చాలా గ్రేట్. మోడీ చాలా మంచివాడంటు  ట్రంప్ మాట్లాడారు.


logo