బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 20:38:43

ట్రంప్‌పై ఆయ‌న మేన‌కోడ‌లు దావా!

ట్రంప్‌పై ఆయ‌న మేన‌కోడ‌లు దావా!

న్యూయార్క్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యూయార్క్ స్టేట్ కోర్టులో కేసు న‌మోదైంది. వారసత్వంగా తనకు రావాల్సిన‌ ఆస్తిని ఇవ్వకుండా ట్రంప్ సహా ఇతర కుటుంబసభ్యులు తనను మోసం చేశారని ఆయ‌న మేన‌కోడలు మేరీ ట్రంప్ దావా వేశారు. తన తాత ఫ్రెడ్ ట్రంప్‌కు సంబంధించిన ఎస్టేట్‌లో తనకు వాటా రావాల్సి ఉందని, దాని విలువ సుమారు పదిలక్షల డాలర్ల వరకు ఉంటుందని మేరీ ట్రంప్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 

న్యాయంగా తనకు ద‌క్కాల్సిన వార‌స‌త్వ ఆస్తుల‌ను త‌న‌కు ఇవ్వ‌కుండా అధ్య‌క్షుడు ట్రంప్, ఆయన సోదరి మేరీఅన్నె బ్యారీ, సోదరుడు రాబర్ట్ ట్రంప్ మోసం చేశారని మేరీ ట్రంప్ ఆరోపించారు. అయితే, మేరీ ట్రంప్ పిటిష‌న్‌పై స్పందించేందుకు డొనాల్డ్‌ ట్రంప్, ఆయ‌న కుటుంబసభ్యుల‌ తరఫు న్యాయ‌వాదులు నిరాక‌రించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో ట్రంప్ మేనకోడలు ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకెక్కడం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo