బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 04, 2020 , 12:31:08

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ హ‌వా..

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ హ‌వా..

హైద‌రాబాద్‌:  అమెరికా దేశాధ్య‌క్షుడి భ‌విష్య‌త్తును తేల్చే స్వింగ్ స్టేట్స్ ఫ‌లితాలు తీవ్ర ఉత్కంఠాన్ని రేపుతున్నాయి. ఇప్ప‌టికే కీల‌క‌మైన టెక్సాస్‌, ఫ్లోరిడా రాష్ట్రాల‌ను ట్రంప్ కైవ‌సం చేసుకున్నారు. ఇక జార్జియా, నార్త్ క‌రోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆ రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిప‌త్యం కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. కానీ బైడెన్‌, ట్రంప్ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లుగా సాగుతున్న పోరుతో అమెరికా ఎన్నిక‌లు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి.  మిచిగ‌న్‌, విస్కిన్‌స‌న్ రాష్ట్రాల్లోనూ పోటీ టైట్‌గా ఉంది.  ఐయోవా, ఓహియా రాష్ట్రాల‌ను ట్రంప్ గెలుచుకున్నారు. 

అమెరికా ఎన్నిక‌ల‌పై బెట్టింగ్ జోరుగా సాగుతున్న‌ది.  అయితే ఆ బెట్టింగ్‌లోనూ ఇద్ద‌రి మ‌ధ్య ఫేవ‌ర్స్ టైట్‌గా ఉన్నాయి.  అధ్య‌క్షుడు ట్రంప్ రెండోసారి మ‌ళ్లీ దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డుతార‌ని చాలా వ‌ర‌కు బెట్టింగ్ సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. బ్రిట‌న్‌కు చెందిన స్మార్కెట్స్ ఎక్స్‌చేంజ్ .. 55 శాతం ట్రంప్ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పింది.  ఓ ద‌శ‌లో ట్రంప్‌పై 80 శాతం బెట్టింగ్ న‌డిచింది. స్మార్కెట్స్‌లో బైడెన్ అవ‌కాశాలు 61 శాతం నుంచి 45 శాతానికి ప‌డిపోయాయి. స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ హ‌వా వ‌ల్ల బెట్టింగ్ ఆయ‌న వైపు మ‌ళ్లిన‌ట్లు తెలుస్తోంది.