ట్రంప్ వ్యక్తిగత లాయర్‌కు కొవిడ్ పాజిటివ్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కొవిడ్ -19కు పాజిటివ్‌గా పరీక్షించారు. 76 సంవత్సరాల న్యూయార్క్ మాజీ మేయర్ అట్లాంటాలో ముఖానికి మాస్క్ ధరించకుండా న్యాయబృందంలోని పలువురితో మాట్లాడుతూ కనిపించారు. న్యూయార్క్ మేయర్‌గా గియులియాని ఎంతో సేవలందించారని, అమెరికా ఎన్నికల్లో అక్రమాలపై అక్రమాలను బహిర్గతం చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతూ చైనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో రూడీ వాషింగ్టన్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో చేరారు. గతంలో ట్రంప్, అతని భార్య మెలానియా, కుమారుడు డొనాల్డ్ జూనియర్, అతని కుమారుడు బారన్, ప్రెస్ సెక్రటరీ, సలహాదారులు, ప్రచార నిర్వాహకులు కరోనా బారినపడ్డారు.
ప్రస్తుతం ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదికి కూడా కరోనా సోకింది. గియులియాని వైద్యనిపుణుల సలహాలు పాటించకుండా మాస్క్ లేకుండా తిరిగి కరోనా బారిన పడ్డారు. గియులియాని కుమారుడు ఆండ్రూ వైట్ హౌస్‌లో పనిచేస్తూ గతంలో కరోనా బారిన పడ్డారు. ట్రంప్ చుట్టూ ఉన్న వారు కరోనా బారిన పడుతున్నారని సీనియర్ సలహాదారు డేవిడ్ గెర్గెన్ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. వరుసగా మూడో రోజు, యునైటెడ్ స్టేట్స్లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్క ప్రకారం 2 లక్షలకుపైగా రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14.58 మిలియన్లకు చేరుకుంది.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్