బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 14:02:53

కిమ్ ప‌రిస్థితి ట్రంప్‌కు తెలుసుః ద‌క్షిణ కొరియా

కిమ్ ప‌రిస్థితి ట్రంప్‌కు తెలుసుః ద‌క్షిణ కొరియా

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్న‌వేళ ద‌క్షిణ కొరియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కిమ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలుస‌ని ద‌క్షిణ కొరియా మంత్రి కిమ్ యేన్ చుల్ అన్నారు. ద‌క్షిణ కొరియా పార్ల‌మెంటులో మంగ‌ళ‌వారం ఈ అంశంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుంది అనే అంశంపై అమెరికా ప్ర‌భుత్వానికి అవ‌గాహ‌న ఉంద‌ని అన్నారు. అయితే కిమ్ ఎక్క‌డ ఉన్న‌డో మాత్రం క‌చ్చితంగా తెలియ‌ద‌ని వెల్ల‌డించారు.  


logo