బుధవారం 27 మే 2020
International - Apr 07, 2020 , 10:12:00

ఆ డ్ర‌గ్ ఇవ్వ‌కుంటే.. ప్ర‌తీకారం తీర్చుకుంటాం: ట‌్రంప్‌

ఆ డ్ర‌గ్ ఇవ్వ‌కుంటే.. ప్ర‌తీకారం తీర్చుకుంటాం: ట‌్రంప్‌

అమెరికాలో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భార‌త్ త‌మ‌కు పంప‌ని ప‌క్షంలో ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆ దేశ  అధ్య‌క్షుడు ట్రంప్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మలేరియా నివార‌ణ‌కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో... ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే... అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న సమయంలో... ప్రధాని మోదీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం  ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన ట్రంప్, ఆ ప్రతిపాదన ఫలించకపోవడంతో... ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా స‌మాచారం. కరోనా త‌గ్గిన‌ తర్వాత ట్రంప్... భారత్‌‌పై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే అమెరికాకు డ్రగ్ సరఫరా కొనసాగించాలా వద్దా... అనే అంశంపై భారత్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ తనకు కాల్ చేసినప్పుడు మాత్రం మోదీ...మేం చేయగలిగింది చేస్తామ‌ని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పెరిగిపోతున్న కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యలేకపోతున్న ట్రంప్... భారత్ లాంటి దేశాల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కరోనాను సమర్థంగా కంట్రోల్ చేస్తున్న ఇండియాకి ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.


logo