బుధవారం 03 జూన్ 2020
International - May 19, 2020 , 01:09:50

నీ చిట్టి సాయం గొప్పదమ్మా..!

నీ చిట్టి సాయం గొప్పదమ్మా..!

  • -తెలుగు బాలిక శ్రావ్యకు ట్రంప్‌ ప్రశంస

వాషింగ్టన్‌: కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాలో వయసుకుమించిన గొప్ప సేవ చేస్తున్న తెలుగు బాలిక ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. మేరీలాండ్‌లోని ఓ స్కూల్‌లో నాలుగోతరగతి విద్యార్థి ని శ్రావ్య అన్నపరెడ్డి (10) తన గర్ల్స్‌ స్కౌట్స్‌ బృందం తో కలిసి నర్సులు, తదితరులకు కొద్ది రోజులుగా ఆహారం అందిస్తున్నారు. వారిలో ఉత్సాహం కోసం స్వయం గా తయారుచేసిన గ్రీటింగ్‌ కార్డులిస్తున్నారు. ఈ సంగ తి తెలుసుకున్న ట్రంప్‌ హర్షం వ్యక్తంచేశారు. గత శుక్రవారం కరోనాపై పోరులో సేవలందిస్తున్న వారి అభినందన సభలో శ్రావ్య, తదితరులను అభినందించారు. శ్రావ్య తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌.


logo