శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 12:16:08

నేను మ‌ళ్లీ అధ్య‌క్షుడు అవ‌డం చైనాకు ఇష్టం లేదు: ట‌్రంప్‌

నేను మ‌ళ్లీ అధ్య‌క్షుడు అవ‌డం చైనాకు ఇష్టం లేదు: ట‌్రంప్‌

వాషింగ్టన్: ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ ఎన్నికవ్వడం చైనాకు ఇష్టంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. చైనాపై తాను విధిస్తున్న బిలియ‌న్‌ డాలర్ల దిగుమతి సుంకాలు అందుకు కారణమని చెప్పారు. తనకు బదులు డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్‌ను అమెరికా తర్వాతి అధ్యక్షుడిగా చూడాలని చైనా భావిస్తున్నందున ట్రంప్‌ ఆరోపించారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ క‌రోనా వైరస్‌ వ్యాప్తి విష‌యంలో డ్రాగన్‌ దేశాన్ని సమర్థించే ప్రసక్తే లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. డెమోక్రాట్ల హ‌యాంలో చైనా అమెరికాను అన్ని విధాలుగా దోచుకుంద‌ని, అందుకే ఇప్పుడు జో బిడెన్ అమెరికాకు అధ్య‌క్షుడు కావాల‌ని చైనా కోరుకుంటున్న‌ద‌ని ట్రంప్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. కాగా, ట్రంప్ ఆరోప‌ణ‌ల‌పై ఇటు చైనా, అటు డెమోక్రాట్లు మండిప‌డుతున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo