శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 08, 2020 , 09:44:12

ట్రంప్ అస‌హ‌నం.. డ‌బ్ల్యూహెచ్‌వోపైనా విసుర్లు

ట్రంప్ అస‌హ‌నం.. డ‌బ్ల్యూహెచ్‌వోపైనా విసుర్లు

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న‌ది. అమెరికా యంత్రాంగ‌మంతా వైరస్‌ను కట్టడి చేయడంలోనే నిమగ్నమైనా.. ఆశాజనక ఫలితాలు క‌నిపించ‌డం లేదు. పైగా రాబోవు రోజుల్లో అమెరికాకు మ‌రింత విపత్కర పరిస్థితి ఎదురుకానున్న‌ద‌ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవ‌రుప‌డితే వారిపైన చిందులు వేస్తున్నారు. 

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా నుంచి ఆ సంస్థ‌కు  ఇవ్వాల్సిన నిధుల‌ను నిలిపివేశారు. అంతటితో ఆగకుండా సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌వో చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని మండిప‌డ్డారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన కొత్త‌లో దాని తీవ్ర‌త‌పై డ‌బ్ల్యూహెచ్‌వో వ‌ద్ద స‌మాచారం ఉన్నా.. త‌మ‌తో పంచుకోవ‌డానికి ఇష్టపడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

 


logo