బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 18, 2021 , 23:09:52

ముందే శ్వేత‌సౌధాన్ని వీడ‌నున్న ట్రంప్‌!

ముందే శ్వేత‌సౌధాన్ని వీడ‌నున్న ట్రంప్‌!

వాషింగ్ట‌న్‌: అధ్య‌క్షుడిగా బుధ‌వారం జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌క ముందే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు తీసుకోనున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు వాషింగ్ట‌న్ న‌గ‌ర శివారుల్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వ‌ద్ద ట్రంప్ వీడ్కోలు కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. అక్క‌డ నుంచి ‌ఫోర్స్ వ‌న్ విమానంలో డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాకు బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. బుధ‌వారం 7.15 గంట‌ల‌క‌ల్లా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానితుల‌కు పంపిన ఇన్విటేష‌న్‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. 

తొలి నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌.. త‌న ఓట‌మిని అంగీక‌రించ‌డానికి సిద్ధంగా లేరు. ఈ నేప‌థ్యంలోనే శ్వేత‌సౌధానికి వ‌చ్చే జో బైడెన్‌కు ఎదురుప‌డేందుకు ట్రంప్ అనుకూలంగా లేరు. బైడెన్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కాబోన‌ని ముందే ట్రంప్ ప్ర‌క‌టించారు. గ‌త శ‌తాబ్ద కాలంలో అధికార మార్పిడికి దూరంగా ఉంటున్న డొనాల్డ్ ట్రంప్ మొద‌టి వారు కానున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo