గురువారం 28 మే 2020
International - Apr 19, 2020 , 09:11:19

మేం కాదు.. చైనా నెంబ‌ర్ వ‌న్ : డోనాల్డ్ ట్రంప్

మేం కాదు.. చైనా నెంబ‌ర్ వ‌న్ :  డోనాల్డ్ ట్రంప్

హైద‌రాబాద్‌: వుహాన్‌లో మృతుల సంఖ్య‌ను 50 శాతం పెంచిన విష‌యంపై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా చెబుతున్న లెక్క‌ల‌పై ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు.  అమెరికా క‌న్నా ఎక్కువే చైనాలో మృతుల సంఖ్య ఉంటుంద‌న్నారు. ముందుగా ప్ర‌క‌టించిన దాని క‌న్నా.. మ‌రో 1290 మంది మ‌ర‌ణించిన‌ట్లు వుహాన్ న‌గ‌రం క‌రోనా మృతుల సంఖ్య‌ను స‌వ‌రించిన విష‌యం తెలిసిందే.  అయితే ఈ అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. మేం నెంబ‌ర్ వ‌న్ కాదు, చైనా నెంబ‌ర్ వ‌న్‌, అది మీకు అర్థ‌మ‌వుతుంద‌నుకుంటాన‌ని అన్నారు.  వైట్‌హౌజ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మ‌ర‌ణాల్లో చైనా చాలా ముందున్న‌ది, క‌నీసం ద‌గ్గ‌ర‌లో కూడా మేం లేమ‌న్నారు.

యూకే, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇట‌లీ, స్పెయిన్ లాంటి దేశాల్లో హెల్త్‌కేర్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుంద‌ని, కానీ చైనాలో ఆ దేశాల‌తో పోలిస్తే కేవ‌లం 0.33 శాతం మాత్ర‌మే ఉన్న‌ద‌న్నారు. చైనాలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు.  చైనాలో ఏం జ‌రిగిందో మీకూ తెలుసు, నాకూ తెలుసు. వాళ్లకూ తెలుసు.  కానీ ఆ విష‌యాల్ని వాళ్లు రిపోర్ట్ చేయ‌రు.  ఏదో ఒక రోజు నేనే దాని గురించి చెబుతాన‌న్నారు. ఇక త‌ల‌స‌రి ఆదాయాన్ని లెక్క‌ల్లోకి తీసుకుంటే, యూరోప్ దేశాల క‌న్నా అమెరికాలో చోటుచేసుకున్న మ‌ర‌ణాల రేటు చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు.logo