సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 13:36:16

క‌రోనా మ‌హ‌మ్మారిని ట్రంప్ సీరియ‌స్‌గా తీసుకోలేదు..

క‌రోనా మ‌హ‌మ్మారిని ట్రంప్ సీరియ‌స్‌గా తీసుకోలేదు..

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్ష ప‌ద‌వి అభ్య‌ర్థిగా డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు.  దేశంలో కోవిడ్ మ‌ర‌ణాల‌ను పెర‌గ‌డానికి అధ్య‌క్షుడు ట్రంప్ కార‌ణ‌మంటూ ఆమె ఆరోపించారు.  మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మైన‌ట్లు క‌మ‌లా తెలిపారు.  అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌తో క‌లిసి తొలి ప్రచార స‌భ‌లో పాల్గొన్న క‌మ‌లా హారిస్‌.. ట్రంప్‌పై విరుచుకుప‌డ్డారు. డెలావ‌ర్‌లోని విల్మింగ్ట‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో ఆమె మాట్లాడారు. క‌రోనా వైర‌స్ ప్ర‌తి దేశాన్ని తాకింద‌ని, కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా క‌న్నా ఎక్కువ న‌ష్టం ఏ దేశానికి జ‌ర‌గ‌లేద‌ని, ఎందుకంటే మ‌హ‌మ్మారిని ట్రంప్ సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ న‌ష్టం జ‌రిగిన‌ట్ల క‌మ‌లా తెలిపారు. క‌రోనా టెస్టింగ్ సంఖ్య‌ను పెంచ‌కుండా ట్రంన్ నిరాక‌రించిన‌ట్లు ఆమె ఆరోపించారు.  నిపుణుల కన్నా త‌న‌కే ఎక్కువ తెలుస‌న్న భావ‌న‌తో ట్రంప్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు క‌మ‌లా హారిస్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆరోప‌ణ‌లు చేశారు. అయితే క‌మ‌లా హారిస్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై శ్వేత‌సౌధం ఇంకా స్పందించ‌లేదు. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.logo