ఆదివారం 05 జూలై 2020
International - Jun 03, 2020 , 09:59:05

బైబిల్‌తో ఫోటోకు ఫోజు.. స‌మ‌ర్థించుకున్న ట్రంప్‌

బైబిల్‌తో ఫోటోకు ఫోజు.. స‌మ‌ర్థించుకున్న ట్రంప్‌

హైద‌రాబాద్‌:  శ్వేత‌జాతి పోలీసు చేతిలో న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందిన ఘ‌ట‌న అమెరికాను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న ఓ పురాత‌న చ‌ర్చికి నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. ఆందోళ‌న‌ల్లో ధ్వంస‌మైన‌  ఆ చ‌ర్చికి ట్రంప్ వెళ్లారు.  ఆయ‌న ఆ చ‌ర్చికి వెళ్ల‌డానికి పూర్వం.. అక్క‌డ ఉన్న నిర‌స‌న‌కారుల‌ను బ‌ల‌వంతంగా తొల‌గించారు. దాని కోసం టియ‌ర్ గ్యాస్‌, ర‌బ్బ‌ర్ బుల్లెట్ల‌ను ప్ర‌యోగించారు.  చ‌ర్చిని సంద‌ర్శించిన ట్రంప్ ఆ త‌ర్వాత త‌న చేతిలో బైబిల్ ప‌ట్టుకుని ఫోటోల‌కు ఫోజు ఇచ్చారు.  ట్రంప్ స్టంట్‌పై మ‌తపెద్ద‌లు, డెమోక్రాట్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. 

కేవ‌లం ఫోటోకు ఫోజు ఇచ్చేందుకు ట్రంప్ ఇదంతా చేశార‌ని డెమోక్రాట్లు ఆరోపించారు.  అన‌వ‌స‌రంగా ఆయ‌న రాక సంద‌ర్భంగా శాంతియుత నిర‌స‌న చేస్తున్న‌వారిని చెద‌ర‌గొట్టార‌న్నారు. బైబిల్ ఫోజుపై నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో.. ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.  చ‌ర్చికి వెళ్ల‌డాన్ని మీరు త‌ప్పుగా అర్థం చేసుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఒక‌వేళ నిర‌స‌న‌కారులు శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేప‌డితే,  మ‌రి ఆ చ‌ర్చికి వారెందుకు నిప్పు పెట్టిన‌ట్లు ఆయ‌న ప్ర‌శ్నించారు. పురాత‌న చ‌రిత్ర క‌లిగి ఉన్న ఆ చ‌ర్చికి తాను వెళ్ల‌డాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  
logo