బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 16:09:55

నేను చేసిందంతా క‌రెక్ట్‌.. జ‌ర్న‌లిస్టుల‌పై ట్రంప్ అస‌హ‌నం

నేను చేసిందంతా క‌రెక్ట్‌.. జ‌ర్న‌లిస్టుల‌పై ట్రంప్ అస‌హ‌నం

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.  క‌రోనా వైర‌స్ విప‌త్తును ఎదుర్కోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు.  వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ తాము అన్నీ క‌రెక్ట్ చేశామ‌ని ట్రంప్ అన్నారు.  షెడ్యూల్ క‌న్నా ముందే అంద‌ర్నీ అల‌ర్ట్ చేశామ‌న్నారు. మిలిట‌రీ ఆప‌రేష‌న్ త‌ర‌హాలో ప్ర‌భుత్వం స్పందించింద‌ని ట్రంప్ తెలిపారు. ఎన్ని చేసినా మీడియా మాత్రం ప్ర‌భుత్వాన్ని త‌ప్పుగా చూపిస్తున్న‌ద‌న్నారు.  వైర‌స్ గురించి ప్ర‌జ‌ల‌ను ముందే జాగృతం చేశామ‌న్నారు. ప‌త్రిక‌లు కూడా మాతో క‌లిసి ప‌నిచేస్తే గ‌ర్వ‌ప‌డుతామ‌న్నారు. రాష్ట్రాలు కోరిన‌ట్లు అంద‌రికీ వెంటిలేట‌ర్లు అందిచామ‌న్నారు. కొన్ని ఫేక్ ఛానళ్లు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాయ‌ని ట్రంప్ అన్నారు.

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి బైడెన్ క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని ట్రంప్ కోరారు.  క‌రోనా సంక్షోభం ప‌ట్ల‌ కొన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు స‌రైన రీతిలో స్పందించ‌లేద‌న్నారు. మేం ఏం చేశామో.. అంతా స‌వ్యంగానే చేశామ‌ని,  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో ఎటువంటి అల‌సత్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని ట్రంప్ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం చేసిన ప‌నులను చెప్పుకునేందుకు ట్రంప్ ఓ వీడియోను కూడా ప్లే చేశారు. మీడియా, వైద్య నిపుణులు క‌రోనా గురించి త‌క్కువ చేసి మాట్లాడిన క్లిప్‌ల‌ను కూడా దాంట్లో చూపించారు.  అమెరికా, చైనా మ‌ధ్య విమానాల‌ను ర‌ద్దు చేస్తే త‌మ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టార‌ని, దీని ప‌ట్ల డెమోక్రాట్లు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.  కొంద‌రు గ‌వ‌ర్న‌ర్లు పూర్తి నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని ట్రంప్ అన్నారు.
logo