శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 13, 2021 , 01:54:55

అమెరికా అంతటా అల్లర్లకు కుట్ర!

అమెరికా అంతటా అల్లర్లకు కుట్ర!

  • ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ
  • వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధింపు
  • నేడు ట్రంప్‌ అభిశంసనపై ఓటింగ్‌

వాషింగ్టన్‌: వాషింగ్టన్‌ డీసీతోపాటు అమెరికాలోని మొత్తం 50 రాష్ర్టాల రాజధానుల్లో క్యాపిటల్‌ భవనాల వద్ద సాయుధ నిరసనలకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా సమాచారం అంది ందని ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ హెచ్చరించింది. ఈ నెల 20న  బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు ఫెడరల్‌ ఏజెన్సీల సిఫార్సు మేరకు అధ్యక్షుడు ట్రంప్‌ రాజధాని నగరం వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఈ నెల 24 వరకు ఇది అమల్లో ఉంటుంది.

తొలగించాలంటే 2/3 సభ్యుల ఆమోదం అవసరం..

ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్‌ జరుగనున్నది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజార్టీ ఉన్నది. అయితే సెనేట్‌లో మాత్రం డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు చెరి సగం సీట్లున్నాయి. అధ్యక్షుడిని తొలగించాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం అవసరం. 


logo