ఆదివారం 31 మే 2020
International - May 16, 2020 , 01:24:46

చైనాతో కటీఫ్‌: ట్రంప్‌

చైనాతో కటీఫ్‌:  ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచం ఎదుర్కొంటున్న ‘కరోనా’ సంక్షోభానికి చైనానే కారణమంటూ విరుచుకుపడుతున్న ట్రంప్‌.. డ్రాగన్‌ దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనా కంపెనీల్లో ‘అమెరికన్‌ పెన్షన్‌ ఫండ్‌' పెట్టిన వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్టు ప్రకటించారు. ‘వేల కోట్ల డాలర్లను వెనక్కి తెప్పిస్తున్నా’ అని ఫాక్స్‌ న్యూస్‌ సంస్థకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు. న్యూయా ర్క్‌ స్టాక్‌ఎక్సేంజ్‌, నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయిన చైనా కంపెనీల ఆదా య లెక్కలు అడుగడంపైనా దృష్టిసారించామన్నారు. ఆలీబాబా వంటి చైనాకు చెందిన పలుకంపెనీలు న్యూయార్క్‌ స్టాక్‌ఎక్సేంజీలో లిస్ట్‌ అయ్యాయి. అయితే అమెరికాకంపెనీల మాదిరిగా అవి ఏనా డూ తమ ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేయలేదు.


logo