‘క్యాపిటల్’పై దాడిని ఖండిస్తున్నా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్ భవనంపై దాడిని తానూ వ్యతిరేకిస్తున్నాని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. క్యాపిటల్‌పై దాడిజరిగిన వెంటనే ఫెడరల్ సైన్యాన్ని రంగంలోకి దించినట్లు చెప్పారు. చొరబాటుదారులను వెంటనే భవనం నుంచి ఖాళీ చేయించామన్నారు. అమెరికా ఎప్పటికీ శాంతి భద్రతల దేశంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించిందని చెప్పారు. ఈనెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా అధికార బదిలీపై ఉందని వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా చట్టసభ సభ్యులు కొలువుదీరే కాంగ్రెస్ భవనంపై అసాధారణ స్థాయిలో దాడులకు దిగిన విషయం తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మొదలైన దాడుల పరంపర.. సాయంత్రం వరకు నిరాటంకంగా కొనసాగింది. చివరకు అల్లరిమూకను అదుపుచేసేందుకు జాతీయ బలగాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా రాజధాని వాషింగ్టన్లో నిషేధాజ్ఞలు విధించారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును అధికారికంగా ప్రకటించకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన కుతంత్రం ప్రపంచ దేశాల ముందు అమెరికా తలదించుకొనేలా చేసింది.
— Donald J. Trump (@realDonaldTrump) January 8, 2021
తాజావార్తలు
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!