గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 01:21:47

క్రిమిసంహారకాలు ఇంజెక్ట్‌ చేస్తే పోలా!

క్రిమిసంహారకాలు ఇంజెక్ట్‌ చేస్తే పోలా!

  • దేహంలోకి యూవీ కిరణాలు పంపుదాం
  • శాస్త్రవేత్తలకు ట్రంప్‌ తలతిక్క సలహా

క్రిమిసంహారకాలు ఒకటి రెండు నిమిషాల్లో వైరస్‌ను అంతం చేయడం చూస్తున్నాం. మరి వాటినే ఇంజక్షన్‌ ద్వారా శరీరంలోకి పంపిస్తే ఎలా ఉంటుంది? శరీరం మొత్తాన్ని శుభ్రం చేసినట్టు అవుతుందా?.. ఒకవేళ అతినీలలోహిత కిరణాలు లేదా అంతకన్నా శక్తిమంతమైన కాంతిని మన శరీరం మొత్తం పంపితే ఎలా ఉంటుంది? శాస్త్రవేత్తలు ఓసారి ఆలోచించండి.. 

వాషింగ్టన్‌: అసలే ట్రంప్‌.. ఆపై కరోనా కాలం. ఇక అడ్డేముంది? సాధారణ సమయాల్లోనే వివాదాస్పద, వింతైన వ్యాఖ్యలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు.. అందరూ నవ్వుకునే వ్యాఖ్యలు చేశారు. గురువారం శాస్త్రవేత్తలతో కలిసి వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘క్రిమిసంహారకాలు ఒకటి రెండు నిమిషాల్లో వైరస్‌ను అంతం చేయడం చూస్తున్నాం. మరి వాటినే ఇంజక్షన్‌ ద్వారా శరీరంలోకి పంపిస్తే ఎలా ఉంటుంది? శరీరం మొత్తాన్ని శుభ్రం చేసినట్టు అవుతుందా?. ఓసారి ఆలోచించండి’ అని శాస్త్రవేత్తలకు ట్రంప్‌ సూచించారు. అంతేకాదు..  ‘అతినీలలోహిత కిరణాలు లేదా అంతకన్నా శక్తిమంతమైన కాంతిని ఏదో ఒక విధంగా రోగి శరీరంలోకి పంపితే ఎలా ఉంటుంది? మీరు ఇలాంటి ప్రయోగం ఇప్పటివరకు చేసి ఉండరు. ఇప్పుడు ప్రయత్నించండి. వినడానికైతే బాగుంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైద్య నిపుణులు మండిపడుతున్నారు. ట్రంప్‌ సూచనలు అత్యంత ప్రమాదకరమని.. ఎవరూ ప్రయత్నించవద్దని, అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.


logo