శుక్రవారం 05 జూన్ 2020
International - May 23, 2020 , 11:50:25

చ‌ర్చిల‌ను తెర‌వండి : డోనాల్డ్ ట్రంప్

చ‌ర్చిల‌ను తెర‌వండి :  డోనాల్డ్ ట్రంప్


హైద‌రాబాద్‌: చ‌ర్చిల‌ను, ఇత‌ర ప్రార్థ‌నా మందిరాల‌ను త‌క్ష‌ణ‌మే తెర‌వాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  ప్రార్థ‌న‌స్థ‌లాలు ముఖ్య‌మైన‌వ‌ని, వాటిని తెరిచేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కు పిల‌పునిచ్చారు.  మ‌త‌విశ్వాసాల‌కు కీల‌క‌మైన కేంద్రాలుగా ఉన్న ప్రార్థ‌నా మందిరాల‌ను ఈవారం చివ‌ర‌లోగా తెర‌వాలంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  వీలైనంత త్వ‌ర‌గా మ‌ళ్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని ట్రంప్ చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అన్ని రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌కు ఆదేశాలు చేర వేస్తున్నారు. ప్రార్థ‌న‌మందిరాల‌ను తెర‌వాల‌ని ట్రంప్ చెప్ప‌గానే, అమెరికాకు చెందిన సీడీసీ కొన్నిమార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది. మ‌త కేంద్రాల‌ను సుర‌క్షితంగా ఎలా ఓపెన్ చేయాల‌న్న దానిపై క్లారిటీ ఇచ్చారు. విశాల ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ప్రార్థ‌న‌లు నిర్వ‌హించాల‌న్న‌ది.  


logo