మంగళవారం 14 జూలై 2020
International - Jun 30, 2020 , 01:03:08

ట్రంప్‌ అత్యంత ప్రమాదకారి

ట్రంప్‌ అత్యంత ప్రమాదకారి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయనపై ఎందరో, ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఆయన కుటుంబంలోని వ్యక్తే ట్రంప్‌ను విమర్శిస్తూ ఏకంగా పుస్తకమే రాయడం విశేషం. ట్రంప్‌ సోదరుడైన ఫ్రెడ్‌ కుమార్తె మేరీ. ఆమె ఇటీవల ఓ పుస్తకం రాశారు. ‘టూమచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్‌ మోస్ట్‌ డేంజరస్‌ మ్యాన్‌' అని పేరు పెట్టారు. పుస్తకం పేరులోనే ట్రంప్‌ను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఇందులో తమ కుటుంబ వివాదాలను పేర్కొన్నారు. పారనాయిడ్‌ స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వారిపై 6 నెలల పాటు అధ్యయనం నిర్వహించిన తర్వాత మేరీ ట్రంప్‌ ఈ పుస్తక రచనకు పూనుకోవడం గమనార్హం. ఈ పుస్తకం వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానుంది. 


logo