లండన్: ప్రత్యర్థి జట్టు గోల్ కొట్టకుండా గోడలా అడ్డుకోవడమే ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ బాధ్యత. అలాంటి కీపర్ గోల్ చేయడం అత్యంత అరుదు. అలాంటిది చివరి నిమిషంలో గోల్‌కీపర్ మామూలు ప్లేయర్‌గా మారి స్ట్రయికర్ను తలపిస్తూ అద్భుతమైన హెడర్‌తో మ్యాచ్ గెలిపించడమంటే అది ఆశ్చర్యమే. అలాంటి అరుదైన ఘటనే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో జరిగింది. లివర్‌పూల్ గోల్‌కీపర్ అలీసన్ బెకెర్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. 95వ నిమిషంలో తన జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా ప్లేయర్లతో కలిసిన అలీసన్ అద్భుతమైన హెడర్‌తో గోల్ సాధించాడు. దీంతో వెస్ట్ బ్రోమ్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ 2-1తో గెలిచింది. ఈ విజయంతో చాంపియన్స్ లీగ్ క్వాలిఫికేషన్ అవకాశాలను ఆ జట్టు సజీవంగా నిలుపుకుంది. కాగా 129 సంవత్సరాల లివర్‌పూల్ క్లబ్ చరిత్రలో గోల్బాదిన మొట్టమొదటి గోల్‌కీపర్ అలీసన్ కావడం విశేషం. అలాగే ప్రీమియర్ లీగ్ చరిత్రలో గోల్‌కీపర్ స్కోరు చేయడం ఇది ఆరోసారి కాగా.. విన్నింగ్ గోల్ కొట్టడం ఇదే తొలిసారి.