సోమవారం 25 మే 2020
International - Mar 29, 2020 , 09:35:55

న్యూయార్క్‌ క్వారెంటైన్‌పై వెన‌క్కి త‌గ్గిన‌ ట్రంప్‌

న్యూయార్క్‌ క్వారెంటైన్‌పై వెన‌క్కి త‌గ్గిన‌  ట్రంప్‌

హైద‌రాబాద్‌: న్యూయార్క్‌లో క్వారెంటైన్ ఆంక్ష‌లు విధించ‌డం లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్‌తో పాటు స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ప్రాంతీయ క్వారెంటైన్ ఆంక్ష‌లు అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు.  అయితే ఈ ప్రాంతాల్లో క‌ఠిన‌మైన ప్ర‌యాణ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. వైట్‌హౌజ్‌ క‌రోనా వైర‌స్ టాస్క్ ఫోర్స్‌, న్యూయార్క్ మేయ‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  న్యూయార్క్‌తో పాటు న్యూజెర్సీ, క‌న‌క్టిక‌ట్ ప్రాంతాల్లో క్వారెంటైన్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ట్రంప్ చెప్పారు. అయితే తాజాగా టాస్క్‌ఫోర్స్ ఆదేశాల ప్ర‌కారం ఆ ఆలోచ‌న విర‌మిస్తున్న‌ట్లు తెలిపారు. న్యూయార్క్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 52 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అమెరికాలో క‌రోనా వ‌ల్ల 1800 మంది మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా ల‌క్షా 12 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.logo