గురువారం 28 మే 2020
International - Apr 24, 2020 , 10:54:04

క‌రోనా క‌ట్ట‌డికి ట్రంప్ ఉచిత‌ స‌లహాలు

క‌రోనా క‌ట్ట‌డికి ట్రంప్ ఉచిత‌ స‌లహాలు

వాషింగ్ట‌న్:‌ రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డుతుంటే..చ‌క్ర‌వ‌ర్తి ఫిడేల్ వాయించాడ‌ట ఇది ఒక సామెత‌. అచ్చం ఇది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు స‌రిపోతుందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అక్క‌డ కరోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే..ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు విచిత్రంగా ఉంటున్నాయి. వైరస్‌కు ఔషధాన్ని కనుగొంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా మరో విచిత్రమైన ప్రకటన చేశారు. సూర్యరశ్మి కాంతితో వైరస్‌ను నిరోధించవచ్చ‌ని  ట్రంప్ చెప్పుకొచ్చారు.

 అంతేకాకుండా కరోనా రోగులను ఎక్కువ వేడి ఉన్న చోటు ఉంచాలని, వేడి ఎక్కువగా ఉండే చోట కరోనా మనుగడ సాధించలేదని అన్నారు. రోగులను ఎండకు ఉంచితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. వైరస్‌ సోకకుండా ఉంటుందని పేర్కొన్నారు. చెప్పుకొచ్చారు. అలాగే శక్తివంతమైన సన్‌లైట్‌, అల్ట్రావయొలెట్‌ రేస్‌లతో రోగి శరీరాన్ని వేడి చేయాలని సలహా ఇచ్చారు. క్లీనింగ్‌ ఏజెంట్లను కరోనా రోగుల శరీరంలోకి ఇంజక్ట్‌ చేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు. అటు అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు  8,66,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 48,868కి చేరింది.


logo