బుధవారం 03 జూన్ 2020
International - Apr 06, 2020 , 13:41:54

ఇప్ప‌టికే 15 సార్లు చెప్పాడు.. నువ్వు స‌మాధానం ఇవ్వొద్దు

ఇప్ప‌టికే 15 సార్లు చెప్పాడు.. నువ్వు స‌మాధానం ఇవ్వొద్దు

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 పేషెంట్లు యాంటీ మ‌లేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్ తీసుకుంటే కొంత వర‌కు వ్యాధిని అరిక‌ట్ట‌వ‌చ్చు అని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చెబుతున్నారు.  ఆ మందు త‌మ‌కు కావాల‌ని రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీతోనూ ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఆదివారం వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో.. క్లోరోక్వీన్ మందుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రిగింది.  ప్ర‌భుత్వ వైద్య స‌ల‌హాదారు ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ రిపోర్ట‌ర్ హైడ్రాక్సీక్లోరోక్వీన్ గురించి ప్ర‌శ్న వేశారు.  అప్పుడు ట్రంప్ ఆ జ‌ర్న‌లిస్టుకు ఎద‌రు స‌మాధానం ఇచ్చారు.  క్లోరోక్వీన్ గురించి ఇప్ప‌టికే 15 సార్లు చెప్పాడు, మీరు స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్ ఫౌసీని ట్రంప్ అడ్డుకున్నారు.  హైడ్రాక్సీక్లోరోక్వీన్‌పై వైద్య నిపుణుడు ఫౌసీని మాట్లాడ‌కుండా చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు వాడేందుకు అనుమ‌తి లేదు. కానీ ట్రంప్ మాత్రం ఆ డ్ర‌గ్‌ను వాడాలంటూ సూచిస్తున్నారు.  వైద్యుల అభిప్రాయాల‌కు, ట్రంప్ స‌ల‌హాల‌కు పొంత‌న కుద‌రడం లేదు. logo