బుధవారం 20 జనవరి 2021
International - Dec 04, 2020 , 11:33:10

ఫేస్‌బుక్‌పై ట్రంప్ ప్ర‌భుత్వం దావా

ఫేస్‌బుక్‌పై ట్రంప్ ప్ర‌భుత్వం దావా

వాషింగ్ట‌న్‌: అమెరికా స్థానికుల‌ను ప‌క్క‌న పెట్టి తాత్కాలిక వీసాల‌పై వ‌చ్చిన వ‌ల‌స‌దారుల‌కు ఫేస్‌బుక్ కీల‌క ఉద్యోగాలు ఇచ్చిందంటూ ట్రంప్ ప్ర‌భుత్వం ఆ సంస్థ‌పై దావా వేసింది. జ‌న‌వరి 2018 నుంచి సెప్టెంబ‌ర్ 2019 వ‌ర‌కు స‌గ‌టును 1,56,000 డాల‌ర్ల జీతం ఉన్న 2600 కీల‌క ఉద్యోగాల‌ను ఫేస్‌బుక్ తాత్కాలిక వీసాదారుల‌కు ఇచ్చింద‌ని ఆ దావాలో న్యాయ‌శాఖ ఆరోపించింది. స్థానిక అమెరిక‌న్ల‌ను కాద‌ని, పెద్ద సంఖ్య‌లో తాత్కాలిక వీసాదారుల‌కు ఉద్యోగాలు ఇస్తూ ఫేస్‌బుక్ ఉద్దేశ‌పూర్వ‌కంగా చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తోంద‌ని అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్ ఎరిక్ డ్రీబ్యాండ్ తెలిపారు.  

హెచ్‌1-బీ నైపుణ్యం క‌లిగి ఉద్యోగులు లేదా ఇత‌ర తాత్కాలిక వ‌ర్క్ వీసాదారుల కోసం ఫేస్‌బుక్ పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాల‌ను రిజ‌ర్వ్ చేసి ఉంచింద‌ని న్యాయ‌శాఖ చెప్పింది. త‌న కెరీర్స్ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా, కేవ‌లం నేరుగా వ‌చ్చిన జాబ్ అప్లికేష‌న్ల‌ను అంగీక‌రిండ‌చం ద్వారా లేదా మొత్తంగా అమెరికా స్థానికుల‌ను విస్మ‌రించ‌డం ద్వారా ఉద్యోగాల‌ను ఫేస్‌బుక్ దారి మ‌ళ్లించింద‌ని ఆ దావాలో న్యాయ‌శాఖ ఆరోపించింది. నిజానికి వీటిని స‌ద‌రు సంస్థతో చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల్సి ఉన్నా.. ట్రంప్ ప్ర‌భుత్వం మాత్రం కోర్టులో దావా వేయ‌డాన్ని అసాధార‌ణంగా ప‌రిగ‌ణిస్తున్నారు. 


logo