ఆదివారం 29 మార్చి 2020
International - Feb 06, 2020 , 16:57:29

ట్రంప్ నిర్దోషి..

ట్రంప్ నిర్దోషి..


హైద‌రాబాద్‌:  అభిశంస‌న విచార‌ణ‌ నుంచి అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ బ‌య‌ట‌ప‌డ్డారు. ఇటీవ‌ల‌  అధ్య‌క్షుడు ట్రంప్‌ను విచారించాల‌ని సేనేట్‌లో అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే దానిపై ఇవాళ జ‌రిగిన ఓటింగ్‌లో ద‌ర్యాప్తుకు వ్య‌తిరేకంగా 52 ఓట్లు, అనుకూలంగా 48 మంది ఓటేశారు. అధికార దుర్వినియోగం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై జ‌రిగిన ఓటింగ్‌లో 53-47 ఓట్ల తేడాతో ట్రంప్ గ‌ట్టెక్కారు. అధ్య‌క్ష రేసుకు పోటీప‌డే డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిపై వ‌త్తిడి తెచ్చేందుకు ఉక్రెయిన్ అధ్య‌క్షుడిని ట్రంప్ బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డెమోక్ర‌టిక్‌, రిప‌బ్లిక్ పార్టీ నేత‌లు.. త‌మ త‌మ పార్టీ ఆదేశాల‌కు త‌గిన‌ట్లు ఓటేశారు. దోషా లేకు నిర్దోషా అని స‌భ్యులు బ‌హిరంగానే ప్ర‌క‌టించారు.  అయితే రిప‌బ్లికన్ పార్టీకి చెందిన సేనేట‌ర్ మిట్ రోమ్నీ మాత్రం ట్రంప్ దోషి అంటూ పేర్కొన్న‌ది. పార్టీ ఆదేశాల‌ను ఆయ‌న ఉల్లంఘించారు. అభిశంస‌న తీర్మానం ఎదుర్కొన్న మూడ‌వ అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ నిలిచారు.  అభిశంస‌న ఓటింగ్‌లో గ‌ట్టెక్క‌డంతో.. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండ‌వ‌సారి పోటీప‌డేందుకు ట్రంప్‌కు లైన్ క్లియ‌రైంది. logo