గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 15, 2020 , 19:15:13

అరుదైన పింక్‌ డైమండ్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు..!

అరుదైన పింక్‌ డైమండ్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు..!

జెనీవా: చాలా అరుదైన, సున్నితమైన ఓ పర్పుల్‌-పింక్‌ కలర్‌ డైమండ్‌ వేలంపాటలో కళ్లుచెదిరే ధర సొంతం చేసుకుంది. దీనిని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక వ్యక్తి టెలిఫోన్ బిడ్డింగ్‌ ద్వారా దక్కించుకున్నాడు. ఇంతకీ ఇది ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా.. 21 మిలియన్‌ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ. 198,27,08,140 అన్నమాట. దీన్ని స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వేలం వేశారు. ఈ వజ్రం  రష్యాలో దొరికిందట. ఇది ప్రకృతి నిజమైన ఆత్మ అని ప్రఖ్యాత వేలం సంస్థ ‘సోథెబైస్’ అభివర్ణించింది.

ఈ రత్నాన్ని ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ అని పిలుస్తారు. 1911 సంవత్సరంలో 'బ్యాలెట్ రస్సెస్', దాని ప్రసిద్ధ నృత్యకారిణి వాస్లావ్ నిజిన్స్కీ ప్రదర్శించిన బ్యాలెట్ పేరు పెట్టారు. దీని బరువు సుమారు 14.83 క్యారెట్లు. ఇలాంటి రంగు వజ్రాలు అరుదుగా కనిపిస్తాయి. దాని  జాలక నిర్మాణం వల్ల ఆ రంగు వచ్చింది. ఈ ప్రత్యేకమైన వజ్రాన్ని 2017 లో రష్యన్ వజ్రాల ఉత్పత్తిదారుడు అల్రోసా తవ్వారు. ఇది అతిపెద్ద పింక్ డైమండ్ నుంచి కత్తిరించబడింది. ఇది వేలానికి వచ్చేందుకు ప్రముఖ ఆభరణాల నిపుణుడు బెనాయిట్ రెపెల్లిన్ నాయకత్వం వహించారు. వజ్రాన్ని వేలం వేయబోయే అంచనా ధర 23 మిలియన్ల డాలర్లనుంచి 38 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని సోథెబైస్ అంచానవేసింది. ఈ డైమండ్‌ బిడ్డింగ్‌  16 మిలియన్ల డాలర్ల వద్ద ప్రారంభమైంది.  21 మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయింది.  

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.