గురువారం 09 ఏప్రిల్ 2020
International - Jan 22, 2020 , 17:04:31

మంత్రి కేటీఆర్‌ను కలిసిన స్విట్జర్లాండ్‌ టీఆర్‌ఎస్‌ టీమ్‌

మంత్రి కేటీఆర్‌ను కలిసిన స్విట్జర్లాండ్‌ టీఆర్‌ఎస్‌ టీమ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను దావోస్‌లో స్విట్జర్లాండ్‌, యూకే టీఆర్‌ఎస్‌ టీమ్స్‌ ప్రతినిధులు కలిశారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌.. దావోస్‌కు రెండు రోజుల క్రితం వెళ్లిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రవాస భారతీయుల(ఎన్నారై) విధాన రూపకల్పనకు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు అంశాలపై కూడా చర్చించినట్లు ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైనంత వరకు సహాయం చేస్తామని వారు హామీనిచ్చారు. ఇక ఎన్నారై పాలసీ త్వరలోనే అమల్లోకి వస్తుందని కేటీఆర్‌ చెప్పినట్లు ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. 


logo