మంగళవారం 26 మే 2020
International - Apr 27, 2020 , 19:51:17

సౌతాఫ్రికాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సౌతాఫ్రికాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఈ వేడుకలను జోహెన్నెస్‌బర్గ్‌ సిటీలోని మిడ్రాండ్‌ ఏరియాలో నిర్వహించింది. ఈ వేడుకల్లో సామాజిక దూరం పాటిస్తూ.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత మిడ్రాండ్‌ పోలీసు స్టేషన్‌లో హ్యాండ్‌ శానిటైజర్స్‌ను పంపిణీ చేశారు. గల్ఫ్‌ దేశమైన ఒమాన్‌లో తెలంగాణ వాసులకు నిత్యావసర వస్తువులు అందించడానికి టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ముందుంటుందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమాన్‌ శాఖ అధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డికి నాగరాజు గుర్రాల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, మీడియా ఇంఛార్జి బెల్లి కిరణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ అభిమాని గాదరబొయిన నాగరాజు పాల్గొన్నారు.logo