మంగళవారం 26 మే 2020
International - Apr 29, 2020 , 10:28:39

ఒమాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఒమాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ ఒమాన్‌ శాఖ ఆధ్వర్యంలో మస్కట్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దినసరి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ ఒమాన్‌ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్‌ రెడ్డి మాట్లాడారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించామని తెలిపారు. ఒమాన్‌లో చిక్కుకున్న భారతీయులకు చేయూత అందించేందుకు ముందుకొచ్చిన టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా సభ్యులకు మహిపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

భారత ఎంబసీ సహకారంతో భారత సామాజిక సంఘాలు, ఇతర సేవా సంఘాలతో కలిసి ఒమాన్‌ ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ సోహెల్‌ ఖాన్‌(హైదరాబాద్‌ వాస్తవ్యుడు) ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి భారతీయులందరికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు మహిపాల్‌ చెప్పారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఒమాన్‌ శాఖ సభ్యులు షేక్‌ అహ్మద్‌, సాయి కుమారు చౌదరి, యూనిస్‌, మధు, వీరేందర్‌, లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. logo