శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 25, 2020 , 15:48:53

'కారు' ప్రభంజనంపై టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా హర్షం

'కారు' ప్రభంజనంపై టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా హర్షం

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు ప్రభంజనంపై టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా కోర్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తుంటే.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆ పార్టీ ఎన్నారై సౌతాఫ్రిక ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాల పేర్కొన్నారు. గత ఆరేళ్ళలో రాష్ట్రములో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎంతో మేలు చేకూర్చాయన్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని నాగరాజు తెలిపారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు నాగరాజు.   


logo