గురువారం 02 ఏప్రిల్ 2020
International - Nov 12, 2019 ,

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షులు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షులు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు ఇచ్చిన చాలెంజ్ ను ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ స్వీకరించారు. ప్యారిస్ లో శ్రీనివాస్ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని చెప్పారు. సంతోష్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న తన మిత్రులను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.logo
>>>>>>