శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 14:39:16

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. ప్రవాసుల హర్షం

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. ప్రవాసుల హర్షం

లండన్‌ : కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. కవిత అభ్యర్థిత్వంపై ఎన్‌ఆర్‌ఐ యూకే సలహా మండలి వైస్‌ చైర్మన్‌ సిక్కా చంద్రశేఖర్‌ గౌడ్‌ స్పందిస్తూ.. ప్రజా నాయకురాలైన కవితకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పోరాట చేసి అనంతరం ఎంపీగా గెలుపొంది రాష్ర్టానికే కాకుండా యావత్‌ దేశానికి సేవలిందించారని కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డగా జాగృతి అధ్యక్షురాలిగా ఉంటూ మన సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారన్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఇటువంటి గొప్ప నాయకురాలికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం సంతోషకరమన్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా ఓటేసి కవితను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. కవిత ఎంపికతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారన్నారు. ప్రవాసులందరి పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చంద్రశేఖర్‌ గౌడ్‌ పేర్కొన్నారు.


logo