మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 16:34:00

ఆస్ట్రేలియాలో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ పట్టణాల్లో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. విక్టోరియా ఇన్‌చార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో శివ విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్‌ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కవిత సహకారం వల్లే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో టీఆర్‌ఎస్‌ కార్యవర్గాలను ఏర్పరుచుకున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో చాటిచెప్పామని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ జాగృతి ద్వారా కవిత కాపాడారని ఆయన అన్నారు. కవిత బర్త్‌డే వేడుకల్లో రాజేష్‌ గిరి రాపోలు, రవి సాయల, ప్రవీణ్‌ పిన్నమ, శ్రీకాంత్‌ రెడ్డి, రవి యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


logo