శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 18:50:04

స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తి: ‌చైనా

స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తి: ‌చైనా

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు త‌గ్గిపోయాయ‌ని, ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్న అన్ని ప్రాంతాల నుంచి త‌మ‌ బలగాల ఉపసంహరణ పూర్తయింద‌ని చైనా పేర్కొంది. మంగళవారం జ‌రిగిన‌ మీడియా సమావేశంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఈ విష‌యాన్ని వెల్లడించారు. ఇరుదేశాల మ‌ధ్య త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని ఆయ‌న‌ తెలిపారు. 

'ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్‌ లోయ, హాట్ స్పింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించాం. మరోసారి కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం' అని వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. కాగా, జూన్ 15న గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య ఉద్రిక్తతలను త‌గ్గించేందుకు పలుమార్లు దౌత్య, సైనికపరమైన చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇరుదేశాలు బలగాల‌ను ఉప‌సంహరించుకుంటున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo