సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 19:31:19

‘దురాక్రమణదారులను వైట్‌హౌస్‌ నుంచి సాగనంపుతాం..’

‘దురాక్రమణదారులను వైట్‌హౌస్‌ నుంచి సాగనంపుతాం..’

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డోనాల్డ్‌ ట్రంప్‌ మర్యాదగా ఒప్పుకోవాలని బైడెన్‌ మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. ఓటమిని వ్యతిరేకించే దురాక్రమణదారులను వైట్‌హౌస్‌ నుంచి సెక్యూరిటీతో సాగనంపుతామంటూ హెచ్చరించారు. పలు కీలక రాష్ట్రాల ఫలితాల్లో ట్రంప్‌ కన్నా బైడెన్‌ ముందున్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటమిని ఒప్పుకోవడానికి తాను సిద్ధంగా లేనని ట్రంప్‌ చెబుతూనే ఉన్నారు. ఎన్నికల్లో అవకతవకలు, మోసాలు జరిగాయని ఆయన ఆరోపించారు. రీఎలక్షన్‌ కోరతానిని ట్రంప్ అన్నారు. ఇప్పటికే పలు ఆరోపణలతో కోర్టును కూడా ఆశ్రయించారు. అధికారం కోల్పోయినా కూడా వైట్‌హౌస్‌ను వీడబోనని జూలైలో ట్రంప్‌ అన్నారు.

కాగా మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 270 ఎలక్టోరల్‌ ఓట్లకు బైడెన్‌ దగ్గరగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో అమెరికా అధ్యక్ష పగ్గాలను ఆయన చేపట్టడం ఖాయమని డెమెక్రాటిక్‌ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మర్యాదగా ఓటమిని అంగీకరించి వైట్‌హౌస్‌ను ఖాళీ చేయకపోతే బలవంతంగా బయటకు పంపుతామని బైడెన్‌ మద్దతుదారులు హెచ్చరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.