చెట్లు ..పొలాల గట్లే కాదు.. ఇండ్ల మధ్య ఉన్న చెట్టుతో కూడా గొడవే. అందుకు ఇదే ఉదాహరణ. ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లో రెండ్లు ఇండ్ల మధ్య ఈ చెట్టు ఉంది. దీని గురించి రెండు ఇండ్ల వారికి 25 ఏండ్లుగా గొడవే. కొట్టేయాలని ఒకాయన.. వద్దు అని ఒకాయన. కొన్ని రోజుల క్రితం ఆ రెండు కుటుంబాల్లో ఒకటైన భరత్ మిస్త్రీ(56) కుటుంబం ఎటో వెళ్లింది. ఇదే అదనుగా పక్కింటాయన చెట్టును ఇలా నిలువునా సగానికి కొట్టేశాడు. తన వైపు కొమ్మలపై పావురాలు వాలుతున్నాయని, కారు నడపడం ఇబ్బందిగా ఉందని ఆ పని చేశాడు. ఆ చెట్టు ఇప్పుడు పర్యాటక ప్రదేశం అయింది.