మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 16:05:53

కరోనా రోగులను గుర్తుపట్టే విధంగా కుక్కలకు శిక్షణ

కరోనా రోగులను గుర్తుపట్టే విధంగా కుక్కలకు శిక్షణ

శాంటియాగో : సౌత్‌ అమెరికాలోని చిలీ పోలీసులు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన రోగులను పసిగట్టే విధంగా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. సాధారణంగా పోలీస్‌ కుక్కలను పేలుడు పదార్ధాలు గుర్తించడానికి, తప్పిపోయిన వారిని కనుగొనడానికి ఉపయోగిస్తారు. కానీ చిలీలో వైరస్‌ కలిగిన వ్యక్తిని పసిగట్టే విధంగా శిక్షణ ఇస్తుండడం గమనార్హం. 

వైరస్‌కు వాసన లేనప్పటికీ, అది ప్రేరేపించే జీవక్రియ మార్పుల వల్ల వ్యాధి గ్రస్తుల చెమట భిన్నమైన వాసనను కలిగి ఉండి పసిగట్టేలా చేస్తాయని వెటర్నరీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ ఫెర్నాండో మార్డోన్స్ తెలిపారు. ఈ విధంగా శిక్షణ ఇచ్చి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో కుక్కల సాయంతో వ్యాధిగ్రస్తులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. యూకేకు చెందిన ఛారిటీ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ కూడా ఇదే తరహాలో శిక్షణ పొందుతున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo