బుధవారం 03 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:36:34

కిమ్ ట్రైన్ అక్క‌డే ఉంది..

కిమ్ ట్రైన్ అక్క‌డే ఉంది..

హైద‌రాబాద్‌: ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్  ఆచూకీ లేరు.  ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు.  కిమ్ గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నార‌ని, అది విక‌టించ‌డం వ‌ల్ల‌ బ్రెయిన్ డెడ్ అయ్యార‌ని కూడా వ‌దంతులు వ్యాపించాయి. కానీ 36 ఏళ్ల కిమ్‌కు చెందిన రైలు ఆచూకీ చిక్కింది. కీల‌క‌మైన స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు కిమ్ త‌న గ్రీన్ రైలును వినియోగిస్తారు. అయితే ఆ రైలు.. కిమ్ ప్యామిలీకి చెందిన వోన్‌సాన్ కాంపౌండ్‌లో క‌నిపించింది.  శాటిలైట్ దృశ్యాల ద్వారా ఆ విష‌యాన్ని ద్రువీక‌రించారు.  ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఆ రైలు అక్క‌డే ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ రైలు ఉన్నంత మాత్రాన‌.. ఉత్త‌ర‌కొరియా నేత కిమ్ బ్ర‌తికున్నారా లేక ఆయ‌న ఆరోగ్యానికి ఏమైనా అయ్యిందా అన్న విష‌యం మాత్రం క్లారిటీలేదు. కానీ రైలు ఉంది కాబ‌ట్టి.. అత‌ను అక్క‌డే ఉండి ఉంటార‌న్న అనుమానాలు మాత్రం వ్య‌క్తం అవుతున్నాయి. 

కిమ్ ఫ్యామిలీ కోసం రిజ‌ర్వ్ చేసిన రైల్వే స్టేష‌న్‌లో ఆ రైలు ఆగి ఉన్న‌ది. దాని పొడువు సుమారు 250 మీట‌ర్లు. ఏప్రిల్ 15వ తేదీన ఆ రైలు అక్క‌డ లేదు. కానీ ఏప్రిల్ 21, 23 తేదీల్లో ఆ రైలు అక్క‌డే ఉన్న‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా గుర్తించారు. డిపార్చ‌ర్ అయ్యేందుకు రెఢీగా ఉన్న ఆ రైలు మాత్రం కొన్ని రోజుల నుంచి క‌ద‌ల‌లేదు. వోన్‌స‌న్ కాంప్లెక్స్‌లో గెస్ట్‌హౌజ్‌లు, రిక్రియేష‌న్ సెంట‌ర్లు, షూటింగ్ రేంజ్‌లు, యాచింగ్ ఏరియాలు ఉన్నాయి. గ‌తంలో ఆ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ ర‌న్‌వేను ఇప్పుడు హార్స్ రైడింగ్ ట్రాక్‌గా వాడుతున్నారు. 

కిమ్ చివ‌రిసారి ఎయిర్ ఫోర్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆచూకీ లేదు. కానీ వోన్‌స‌న్ ఏరియాలోనే కిమ్ ఉన్న‌ట్లు గుర్తించారు. మ‌రోవైపు కిమ్‌కు చికిత్స అందించేందుకు ముగ్గురు చైనా వైద్యులు ఉత్త‌ర కొరియా వెళ్లారు. దీంతో కిమ్ ప్రాణాల‌పై డౌట్లు వ్య‌క్తం అవుతున్నాయి. 

logo