ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 11:35:41

మాన‌వ‌త్వం ఇంకా బ‌తికే ఉంది.. ఊరంతా క‌లిసి బాలుడికి సైకిల్ కొనిచ్చారు!

మాన‌వ‌త్వం ఇంకా బ‌తికే ఉంది.. ఊరంతా క‌లిసి బాలుడికి సైకిల్ కొనిచ్చారు!

చేసే సాయం చిన్న‌దైనా పెద్ద‌దైనా అది ఇచ్చే ఆనందాన్ని వెల‌క‌ట్ట‌లేం. ఎవ‌రి జీవితం వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో ఓ పిల్లాడి బాధ‌ను చూడ‌లేక ఊరంతా చందాలేసుకొని మ‌రి అత‌ని బాధ‌ను తీర్చారు. ఇంత‌కీ అత‌ను ఎవ‌రు. వాళ్లు చేసిన సాయం ఏంట‌నుకుంటున్నారా?  వాళ్లు కొనిచ్చింది చిన్న సైకిల్‌. కానీ సైకిల్ అనేది బాలుడి జీవితంలో పెద్ద మొత్తంతో కూడుకున్న‌ది. స‌రీనాలో నివ‌సిస్తున్న లాక్లీన్ అనే ప‌దేండ్ల బాలుడు కొన్ని రోజుల క్రితం సైకిల్ మీద బ‌య‌ట‌కు వెళ్లాడు. సైకిల్‌ను ఒక‌చోట పార్క్ చేసి తిరిగొచ్చి చూసేస‌రికి కీ ఎక్క‌డో పోగొట్టుకున్నాడు. స‌రేలే అని సైకిల్ అక్క‌డే పెట్టి ఇంటికి వెళ్లి మ‌రుస‌టి రోజు మ‌రో 'కీ' తీసుకొచ్చాడు. తీరా అక్క‌డికి చేరుకునే స‌రికి సైకిల్‌ను ఎవ‌రో దొంగిలించారు. అంతే.. బాలుడు ఏడుపు ముఖంతో ఇంటిముఖం ప‌ట్టాడు.

సైకిల్ పోయింద‌ని అమ్మ చంప్మాన్‌తో దిగాలుగా చెబితే ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్న‌ది త‌ల్లి. కానీ బాధ‌ను ఆపుకోలేక బాలుడు అమ్మ ముందే గ‌ట్టిగా ఏడ్చేశాడు. దీంతో ఆ త‌ల్లికి బాధ మ‌రింత ఎక్కువైంది. మ‌రో సైకిల్ కొనిచ్చేంత స్తోమ‌త కూడా లేదు. వీరి బాధ గురించి చుట్టు ప‌క్క‌ల కూడా విస్త‌రించింది. దీంతో ఊరంతా క‌లిసి సాయం చేయాల‌నుకున్నారు. ఫండ్ రైజింగ్ ద్వారా డ‌బ్బులు సేక‌రించి ప‌ట్ట‌ణ వాసులంతా క‌లిసి సైకిల్ కొన్నారు. దీనికి లాక్లీన్ పుట్టిన‌రోజు నాడు స‌ర్‌ఫ్రైజ్ గిఫ్టులా ఇచ్చారు. వీరి మంచిత‌నం, చేసిన సాయానికి త‌ల్లీకొడుకు క‌ళ్ల‌ల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 


logo