మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 13:17:19

సూప‌ర్ మార్కెట్‌లో కూలిన అల్మారాలు.. ఇద్ద‌రు మృతి!

సూప‌ర్ మార్కెట్‌లో కూలిన అల్మారాలు.. ఇద్ద‌రు మృతి!

సూప‌ర్ మార్కెట్లో అల్మారాలు ఎత్తుగా ఉంటాయి. వాటి నిండా స‌రుకులు నింపేసి ఉంటుంది. పైనున్న వ‌స్తువుల‌ను అందుకునేట‌ప్పుడు అవి మీద ప‌డితేనే తట్టుకోలేం. అలాంటిది అల్మారాలే మీద ప‌డితే..? బ్రెజిల్‌లోని  సావో లుయీస్‌లో గల మాటెయుస్ అటాకరేజో మిక్స్ సూపర్ మార్కెట్‌లో ఓ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఎత్తైన అల్మారాలు మీద ప‌డ‌టంతో 21 ఏండ్ల యువ‌తి అక్క‌డిక‌క్క‌టే మ‌ర‌ణించింది. ఆమె ఆ సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేసే ఉద్యోగి. ఇదిలా ఉంటే మ‌రో 8 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న అంతా అక్క‌డే ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. కొంద‌రు ముందుగానే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టడంతో అక్క‌డి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఇది నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 


logo