మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 10:58:50

ఫోటోకు ఫోజ్ ఇస్తూ మ్యూజియంలోని శిల్పాన్ని విర‌గొట్టాడు.. ఏం తెలియ‌న‌ట్లు యాక్టింగ్‌!

ఫోటోకు ఫోజ్ ఇస్తూ మ్యూజియంలోని శిల్పాన్ని విర‌గొట్టాడు.. ఏం తెలియ‌న‌ట్లు యాక్టింగ్‌!

మ్యూజియం అంటేనే పురాత‌న వ‌స్తువులు, శిల్పాలు ఉంటాయి. వీటిని ఏ మాత్రం క‌దిలించినా విర‌గ‌డం ఖాయం. అందుకే ప్ర‌తి శిల్పానికి తాకేందుకు వీలు లేకుండా అద్దాలు అమ‌ర్చి ఉంటారు. కానీ ఇట‌లీలోని ఒక మ్యూజియంలో అలాంటి వెసులుబాటు లేన‌ట్లుంది. అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌ర్యాట‌కులు శిల్పాల మీద కూర్చొని మ‌రీ ఫోటోల‌కు ఫోజులు ఇస్తున్నారు. ఇవి 200 ఏండ్ల పురాత‌న‌మైన ఒక శిల్పం మీద కూర్చొని ఆస్ట్రియాకు చెందిన ఒక ప‌ర్యాట‌కుడు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు.

త‌ర్వాత ఏమైందో ఏమో అక్క‌డే అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. అంద‌రూ అన్ని వైపుల‌కు వెళ్లి శిల్పాల‌ను చూస్తుంటే ఇత‌ను మాత్రం అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్నాడు. అక్క‌డ ఏం జ‌రిగిందో మ‌నుషులు గుర్తించ‌క‌పోయినా సీసీకెమెరా మాత్రం స్కాన్ చేసేసింది. అత‌ను కూర్చున్న శిల్పం కుడికాలి బొట‌నవేలు విరిగిపోయింది. అది ఎవ‌రికీ క‌నిపించ‌కూడ‌దు అని అత‌ను అక్క‌డే తిరుగుతున్నాడ‌ని త‌ర్వాత  అర్థ‌మైంది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా నెటిజ‌న్లు అత‌ని మీద మండిప‌డుతున్నారు. 'అత‌నికి కొంచెమైనా జాగ్ర‌త్త‌లేదా' అంటూనే 'శిల్పాల చుట్టూ భ‌ద్ర‌తా తీగ‌లు ఎందుకు లేవ‌ని' ఆశ్య‌ర్య‌పోతున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. 

    


logo