బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 02:12:04

వైరస్‌ కట్టడికి ‘కఠిన’ వ్యూహం

వైరస్‌ కట్టడికి ‘కఠిన’ వ్యూహం

  • పోలీసుల సాయంతో లాక్‌డౌన్‌ అమలు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరో నా మహమ్మారి ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో వైరస్‌ కట్టడికి పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్నా యి. విశ్వమారి వ్యాప్తిని నియంత్రించడానికి ఈ దఫా పోలీసుల సాయంతో మరింత కఠిన చర్యలను అవలంభిస్తున్నాయి. అమెరికాలోని 24కు పైగా రాష్ర్టాల్లో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. గతంలో విధించిన ఆంక్షలతో పోలిస్తే, ప్రస్తుత లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినంగా ఉన్నాయని కాలిఫోర్నియాలోని రెస్టారెంటు యజమానులు తెలిపారు. వెనిజులా, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, జర్మనీదేశాలూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌ నగరం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానికులు స్పందిస్తూ.. ‘ప్రభుత్వం మమ్మల్ని గినియా పందుల్లా బంధిస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇరాన్‌లో 2.5 కోట్ల మందికి కరోనా

ఇరాన్‌లో 2.5 కోట్ల మంది కరోనా బారిన పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ శనివారం ప్రకటించారు. అయితే అక్కడి అధికారులు చెబుతున్న గణాంకాల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.


logo