శనివారం 16 జనవరి 2021
International - Jan 12, 2021 , 22:13:22

మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌సంగం స‌రైన‌దే: ట‌్రంప్‌

మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌సంగం స‌రైన‌దే: ట‌్రంప్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ఎన్నిక‌ను ధ్రువీక‌రించేందుకు ఈ నెల ఆర‌వ తేదీన జ‌రిగిన అమెరికా కాంగ్రెస్ స‌మావేశంపై త‌న మ‌ద్ద‌తుదారుల దాడికి ముందు తాను చేసిన ప్ర‌సంగం పూర్తిగా స‌రైన‌దేన‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయ ప‌డ్డారు. త‌న‌పై రెండో ద‌ఫా అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం పూర్తిగా హాస్యాస్ప‌దం, అది విప‌రీత‌మైన కోపాన్నీ తీసుకువ‌స్తుంద‌న్నారు.

వైట్ హౌస్ నుంచి టెక్సాస్‌కు బ‌య‌లుదేరి వెళ్లే ముందు మెరైన్ వ‌న్ విమానంలో ట్రంప్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ‌లో త‌న‌పై బుధ‌వారం అభిశంస‌న తీర్మానం చ‌ర్చ‌కు రానుండ‌టం  దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మంత్ర‌గ‌త్తె మాదిరిగా వేటాడ‌టం వంటిద‌ని అభిప్రాయ ప‌డ్డారు. 

అమెరికా కాంగ్రెస్‌పై దాడికి ప్రోత్స‌హించార‌న్న అభియోగంపై ఎనిమిది రోజుల్లో అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి వైదొలుగ‌నున్న ట్రంప్ రెండోసారి అభిశంస‌న తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడి త‌ర్వాత ట్రంప్ ఏకాకి అయ్యారు. మ‌ద్ద‌తుదారులు దూర‌మ‌య్యారు. సోష‌ల్ మీడియా ఆయ‌న‌ను నిషేధించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.