గురువారం 28 మే 2020
International - Apr 13, 2020 , 19:55:54

టోర్నాడోల బీభ‌త్సం.. 18 మంది మృతి

టోర్నాడోల బీభ‌త్సం.. 18 మంది మృతి

హైద‌రాబాద్‌: అమెరికాలో టోర్నాడోలు మ‌హావిల‌యం సృష్టించాయి. ఆదివారం వ‌చ్చిన టోర్నాడోల‌తో సుమారు 18 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు చెప్పారు.  మిస్సిసిప్పీలో ఏడు మంది చ‌నిపోయారు.  అర్కాన్సాలో ఒక‌రు మృతిచెందారు.  టోర్నాడోల ధాటికి సుమారు ఏడున్న‌ర ల‌క్ష‌ల ఇండ్ల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. సుమారు 39 చోట్ల టోర్నాడోలు బీభ‌త్సం సృష్టించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  అమెరికాలోని లూసియానా, టెక్సాస్‌, మిసిసిప్పీ రాష్ట్రాల్లో టోర్నాడోలు వ‌చ్చాయి. టోర్నాడోల‌తో పాటు బ‌ల‌మైన గాలులు వీయ‌నున్న‌ట్లు వెద‌ర్ అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల చాలా వ‌ర‌కు రాష్ట్రాలు స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాల‌ను పాటిస్తున్నాయి. ప‌లు లాక్‌డౌన్ ఆంక్ష‌ల వ‌ల్ల ప్ర‌భుత్వ ఆశ్ర‌మ కేంద్రాలు కూడా మూత‌ప‌డ్డాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో సోష‌ల్ డిస్టాన్సింగ్ కూడా ఓ స‌మ‌స్య‌గా మారింది.


 

  


logo