గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 02:18:23

అమెరికాలో సుడిగాలుల బీభత్సం..

అమెరికాలో సుడిగాలుల బీభత్సం..

  • 30 మందికిపైగా మృతి 

వాషింగ్టన్‌: అమెరికాలో సుడిగాలుల బీభత్సానికి 30 మందికిపైగా మృతి చెందారు. టెక్సాస్‌, అర్కాన్‌సాస్‌, లూసియానా, మిస్సిస్సిప్పీ,  అలబామా, జార్జియా, దక్షిణ, ఉత్తర కరోలినా , టెన్సిసీ రాష్ర్టాల్లో దీని ప్రభావం బాగా కనిపించింది. ఇండ్లు ధ్వంసం కాగా, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. మిస్సిస్సిప్పీలో 11 మంది, దక్షిణ కరోలినాలో 9 మంది, జార్జియాలో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. 


logo