బుధవారం 27 మే 2020
International - Apr 25, 2020 , 19:16:26

ఫేస్‌ మాస్క్16 వేలు...ధరించడానికా దాచుకోవడానికా..

 ఫేస్‌ మాస్క్16 వేలు...ధరించడానికా దాచుకోవడానికా..

హాట్‌ అంటే ముట్టుకుంటే కాల్తయని కాదు..  మాస్కుల తయారీలోకి బ్రాండెడ్‌ కంపెనీలు ఎంటర్‌ అయ్యాయి.  కరోనా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మాస్క్‌ తప్పని సరి అయింది. మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే ఉన్నోడు, లేనోడు అందరూ ధరించాల్సిందే. మనిషి అవసరాన్ని కొన్ని కంపెనీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. బ్రాండెడ్‌పేరుతో మాస్కులు తయారు చేసి వేసుకునే డ్రెస్‌కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాయి. వాటి ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతయి. ఇంతకీ ఆ మాస్కులు పెట్టుకోవడానికా.. షొకేష్‌లో దాచుకోవడానికా అని జనం అంటున్నారు. ఇంతకీ అవి ఏ బ్రాండ్‌ మాస్కులు, వాటి ధర ఎంతో చూద్దాం...

నైకీ ఫేస్‌ మాస్క్‌

ప్రముఖ క్రీడా పరికరాల  బ్రాండ్‌ నైకీ ఫేస్‌ మాస్కులను తయారు చేసింది. సాధారణంగానే నైకీ ఉత్పత్తులు ఎక్కువ ధరకు ఉంటాయి. మరి నైకీ నుంచి వచ్చిన మాస్క్‌కూడా అదే స్థాయిలో ఉండాలి కాదా. ఆ కంపెనీ ఎక్స్‌ఎంఎండబ్ల్యూ పేరుతో మాస్క్‌ తయారు చేసింది. దాని ధర అక్షరాల  పదహారు వేల రూపాయలు(రూ.16000). 

ఆఫ్‌ వైట్‌ ఫేస్‌ మాస్క్‌

మాములుగా మాస్క్‌ అంటే పది నుంచి ఇరవై రూపాయలుంటుంది. కానీ అమెరికాకు చెందిన ‘ఆఫ్‌ వైట్‌' అనే కంపెనీ తయారు చేసిన మాస్క్‌ ధర తెలిస్తే మీరు వామ్మో అంటారు. దాని ధర ఏకంగా పది వేల రూపాయలు. ప్రస్తుతం అమెరికాలో దీనికి డిమాండ్‌ కూడా ఎక్కువే ఉంది. హాఫ్‌ వైట్‌ కంపెనీ తయారు చేస్తున్న మాస్క్‌ కాటన్‌తోనే ఉన్నప్పటికీ దాన్ని సెలబ్రెటీలు వాడడంతో దాని డిమాండ్‌ పెరిగింది.  ఇండియాలో కూడా బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కుమార్‌ ఆఫ్‌వైట్‌ మాస్క్‌ ధరించి ప్రెస్‌ మీట్‌ ఇచ్చాడు. 


logo