గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 01:21:05

నటులు టామ్‌హంక్స్‌ దంపతులకు వైరస్‌

నటులు టామ్‌హంక్స్‌ దంపతులకు వైరస్‌

శాన్‌ఫ్రాన్సిస్కో:  హాలీవుడ్‌ నటుడు టామ్‌హంక్స్‌, ఆయన భార్య, నటి రీటా విల్సన్‌కు కరోనా సోకింది. ఈ విషయా న్ని హంక్స్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఇటీవల తాము ఆస్ట్రేలియా వెళ్లినట్టు చెప్పారు. అక్కడ అలసట, ఒంటినొప్పి, తుమ్ములు, స్వల్పంగా జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకొన్నామని అన్నారు. వైద్యులు తమను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారని, వారి సూచనలు పాటిస్తున్నామని తెలిపారు. 


logo
>>>>>>