బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 12:02:45

అంత‌రిక్షంలో సినిమా షూటింగ్‌.. అక్క‌డికి వారిద్ద‌రు ప్ర‌యాణం!

అంత‌రిక్షంలో సినిమా షూటింగ్‌.. అక్క‌డికి వారిద్ద‌రు ప్ర‌యాణం!

అంత‌రిక్షానికి సంబంధించిన సినిమాలు చాలానే చూశాం. అయితే ఇందులో ఎక్కువ‌గా గ్రాఫిక్సే. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అనుకుంటే పొర‌పాటే. ఈ సినిమాను నిజంగా అంత‌రిక్షంలోనే షూటింగ్ చేయ‌నున్నారు. ఇంతకీ ఈ సినిమాలో న‌టించే హీరో ఎవ‌రు అనుకుంటున్నారు? థ‌్రిల్ల‌ర్‌, యాక్ష‌న్‌కు మారు పేరైన ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు టామ్ క్రూజ్‌. ఇత‌ను గ్రాఫిక్స్‌గా తీయాల్సిన కొన్ని స్టంట్స్‌ను సైతం అల‌వోక‌గా చేయ‌గ‌ల‌డు. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఇలాంటి సాహ‌సాలు మాత్రం ఆప‌డం లేదంటే ఎంత గొప్పో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 2021, అక్టోబ‌ర్‌లో వీరి అంత‌రిక్ష ప్ర‌యాణం మొద‌ల‌వ్వ‌నున్న‌ది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్త‌య్యాయి.

అయితే హీరోతోపాటు ద‌ర్శ‌కుడు డ‌గ్ లిమ‌న్‌లు అనుకున్న డేట్ ప్ర‌కారం అంత‌రిక్ష కేంద్రానికి బ‌య‌ల్దేర‌నున్నార‌ని తెలిపింది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నాసా ఉత్సాహం చూపుతుంద‌ని ఇది వ‌ర‌కే నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టిన్ ట్వీట్ చేశారు. దీని గురించి స్పెస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. క‌ట్‌చేస్తే.. ఇప్పుడు ఈ విష‌యాన్ని 'స్పేస్ ష‌టిల్ అల్మానాక్' ట్వీట్ చేసింది. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ర‌ష్యాలోనే అతిపెద్ద స్టూడియో అయిన  ‘యెల్లో, బ్లాక్ అండ్ వైట్ స్టూడియో’ ముందుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక‌పోతే మరోవైపు రష్యా స్పేస్ ఏజెన్సీ రొసోమాస్ కూడా అంతరిక్షంలో సినిమాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మ‌రి ఈ నేప‌థ్యంలో నాసా, స్పేస్ఎక్స్ ఈ సినిమాను తీస్తాయా లేదంటే ర‌ష్యా ఈ ప్రాజెక్టును సొంతం చేసుకుంటుందా అని స‌స్పెన్స్‌గా మారింది. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మించినా షూటింగ్ మాత్రం అంత‌రిక్షంలోనే అంటున్నారు. 


logo