మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 15:42:49

క‌చేరీలో పాల్గొన్న బుడ్డొడు.. అంద‌రిక‌ళ్లు త‌నమీదే!

క‌చేరీలో పాల్గొన్న బుడ్డొడు.. అంద‌రిక‌ళ్లు త‌నమీదే!

చిన్న‌పిల్ల‌లు పెద్దల‌ను ఫాలో అవుతూ ఉంటారు. అవి మంచి ప‌నులైనా, చెడు ప‌నులైనా. న‌చ్చివ‌ని చేసేస్తుంటారు. వీధిలో కొంత‌మంది సంగీతకారులు క‌చేరీ చేస్తుంటే చూడ్డానికి వ‌చ్చిన బుడ్డోడు కూడా వారితో చేరి మ్యూజిక్ ప్లే చేశాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో డ్యాన్స్ కూడా. బుడ‌త‌డి సంగీతం నెటిజ‌న్లు క‌ట్టిప‌డేసింది. సైమ‌న్ బీఆర్ఎఫ్‌సీ హాప్‌కిన్స్ ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

'చిన్న పిల్లాడు వీధి సంగీత‌కారుల‌తో చేరి త‌న హృద‌యంతో మ్యూజిక్ ప్లే చేశాడు. ఇది అంద‌రినీ న‌వ్విస్తుంద‌ని ఆశిస్తున్నాను' అనే క్యాప్ష‌న్ జోడించారు. నెటిజ‌న్లు ఈ వీడియోను ఇష్ట‌ప‌డ్డారు. షేర్ చేసిన వినియోగ‌దారుకు ధ‌న్య‌వాదాలు కూడా తెలిపారు. మ‌రింకెందుకు ఆల‌స్యం ఈ వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేసేయండి. 


logo